ప్రాంతీయం

క్లియర్ విజన్ ఐ హాస్పిటల్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

171 Views

క్లియర్ విజన్ ఐ హాస్పిటల్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి1, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఆదివారం గుగ్గిళ్ల గ్రామంలో క్లియర్ విజన్ కంటి ఆసుపత్రి హైదరాబాద్,ప్రేరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ నవీన ఎన్వి సుభాష్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ నవీణ మాట్లాడుతూ గుగ్గిళ్ల, తిమ్మాయపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చెసి, అవసరమైన వారికి కంటి ఆద్దాలను,అవసరమైన వారికీ కంటి ఆపరేషన్లు చేస్తామని డాక్టర్ నవీన-శుభాష్ తెలిపారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య, మాట్లాడుతూ మా యొక్క గ్రామానికి వచ్చి ఉచిత కంటి వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని,మా గ్రామ ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన క్లియర్ విజన్ ఐ హాస్పిటల్ యాజమాన్యానీకి డాక్టర్ నవీణ-ఎన్వి శుభాష్ కీ గ్రామ ప్రజల పక్ష్యాన ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, దానబోయిన పోచయ్య,శానగొండ శ్రీనివాస్ రెడ్డి, శానగొండ సంతోష్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *