ప్రాంతీయం

బెజ్జంకిలో ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవ వేడుకలు 

90 Views

బెజ్జంకిలో ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవ వేడుకలు

సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మార్చి 1 తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మ  మందకృష్ణ మాదిగ ఆదేశాలను అనుసరిస్తూ,మార్చి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి జరిగిన పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ నేడు అమలులోకి వచ్చిందని, ఈ యొక్క వర్గీకరణకి అమరులైన వాళ్ల యొక్క త్యాగలను స్మరించుకున్నారు.ఈ సందర్బంగా బెజ్జంకి మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మాదిగ అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యతనీ గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి చింతకింది పర్శరాములు, ప్రధానకార్యదర్శి మోదుంపెల్లి రాజు, ఉపధక్షులు బెజ్జంకి శంకర్ పట్టణ అధ్యక్షులు బోనగిరి. చంద్రయ్య, సీనియర్ నాయకులు యువ న్యాయవాది వార్డ్ సభ్యులు లింగాల శ్రీనివాస్, బీసీ గౌడ సంఘం నాయకులు బోనగం రమేష్ , స్వేరో రాష్ట్ర నాయకులు బొర్ర సురేష్ కుమార్, సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు ఉప్పులేటి బాబు, విరపూర్ గ్రామశాఖ అధ్యక్షులు చిలుముల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *