ప్రాంతీయం

కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన

119 Views

మంచిర్యాల జిల్లా.

డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఐడిఓసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాల కోసం పోస్టర్లను విడుదల చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 21వ తారీకు నుండి డిసెంబర్ 4వ తారీఖు వరకు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సహకారంతో వైద్య సిబ్బంది ఆశాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పైన అవగాహన కలిగించాలని ఆదేశించినారు. అదేవిధంగా మన జిల్లాలో తాత్కాలిక పద్ధతులు నోటి మాత్రలు ఐయుడి నిరోద్ నిమర్జెన్సీ కాంట్రాక్టు మాత్రలు అంతరా ఇంజక్షన్ మొదలైన తాత్కాలిక పద్ధతులు అర్హులైన దంపతులు వాడుతున్నట్లు కుటుంబ నియంత్రణ ప్రణాళిక దంపతులిద్దరి బాధ్యత, అదేవిధంగా ఈ సంవత్సరము కుటుంబ నియంత్రణ గురించి భార్యాభర్తలు మాట్లాడుకోవడం ఈరోజు నుండే ప్రారంభించండి అనే నినాదంతో ప్రజలలో అవగాహన కలిగించడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాల తర్వాత వైద్యుల ద్వారా కుటుంబ నియంత్రణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజల భాగస్వామ్యంతో కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలో అవగాహన కలిగించాలి. ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగినప్పుడు అర్హులైన దంపతులను గుర్తించి వారికి ఇష్టమయ్యే తాత్కాల్కే కుటుంబ నియంత్రణ పద్ధతి గూర్చి మరియు పిల్లలు గలిగిన వారికి మగవారికి వ్యాసక్తమి గురించి తెలియజేయాలి. అదేవిధంగా చిన్న కుటుంబం చింతల్ లేని కుటుంబమని తెలియజేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కలిగిస్తూ చూపించాలి.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ డాక్టర్ ఎస్ అనిత డాక్టర్ ప్రసాద్ డాక్టర్ కృపబ్బాయి కాంతారావు పద్మ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి దామోదర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్