ప్రాంతీయం

శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం

66 Views

శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు 

గజ్వేల్, నవంబర్ 17

మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు.ఐదవ రోజు సోమవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ విశేషమైన కార్తీక మాసంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని,భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షం కలగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పురోహితులు బాలచందర్ ధనలక్ష్మి,రామాలయం అర్చకులు అన్విష్ త్రిపాటి,మురికి శ్యాంసుందర్ రావు,బెల్దే సత్యం,బెల్దే కృష్ణమూర్తి,అర్థం లక్ష్మణ్,బెల్దే నాగేందర్,బచ్చు ఆంజనేయులు,చకిలం రమేష్,కాచం శ్రీనివాస్,బెల్దే వెంకటేష్,బెల్దే సంతోష్,నేతి సంతోష్,బెల్దే నరేశ్, మహిళలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *