ప్రాంతీయం

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు

31 Views

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా ఆరుగురు వ్యక్తులను మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా విచారణచేసిఆరుగురువ్యక్తులకు 62,000- జరిమానా విధించారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 10,000/- జరిమాన విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్, మాట్లాడుతూ.రోడ్డుప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ల కి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమనిప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేలరూపాయలజరిమానా విధించడం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000/- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *