ప్రాంతీయం

అనారోగ్యంతో పోరాడుతున్న సభ్యునికి టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) అండ

41 Views

అనారోగ్యంతో పోరాడుతున్న సభ్యునికి టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) అండ

-ఆర్థిక సహాయం అందించిన నాయకత్వం 

ఖమ్మం, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్–2843) ఖమ్మం జిల్లా కమిటీ తమ సభ్యుని సంక్షేమం విషయంలో మానవత్వాన్ని చాటుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఖమ్మం నగరంలోని కార్తీక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మర్కారపు (బస్టాండ్) రమేష్‌ను జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ ఆధ్వర్యంలో నాయకులు పరామర్శించి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. సభ్యుల కష్టసుఖాల్లో తోడుగా నిలవడం తమ కర్తవ్యమని వళ్ళు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వైద్యుల నుంచి రమేష్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్న నాయకులు, మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. అవసరమైన పరీక్షలు, చికిత్సలు సమగ్రంగా చేపట్టి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమమే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్ – 2843) ధ్యేయమని, అత్యవసర సమయంలో సంఘం అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ, ఈసీ సభ్యులు ఓరుగంటి కిరణ్, లింగాల రామ్మూర్తి, కొణతాలపల్లి నాగేశ్వర రావు, టీబీజేఎ జిల్లా కోశాధికారి కాసోజు శ్రీధర్, నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, పట్టణ కార్యదర్శి కప్పల మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *