ప్రాంతీయం

రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహణ

28 Views

రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహణ

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7

రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా, మన సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. సాధన రష్మీ పెరుమాళ్, ఐ.పి.యస్  ఆదేశాల మేరకు, శుక్రవారం విపంచి ఆడిటోరియంలో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని .సుమన్ కుమార్, ఎ.సి.పి ట్రాఫిక్ ఆధ్వర్యంలో ట్రైనీ ఐ.పి.ఎస్ అయేషా  ప్రారంభించారు.ట్రాఫిక్ పోలీసు విభాగము ప్రత్యేక చొరవతో పోలీసు శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యంగా హెవీ వెహికిల్స్ అయిన బస్సు, లారీ, ఆటో మరియు ఇతర గూడ్స్ వాహన డ్రైవర్ల కోసం ఈ( అయిస్ చెకప్ క్యాంపు) ఏర్పాటు చేయబడింది.సిద్దిపేట జిల్లాలో నేషనల్ మరియు స్టేట్ హైవేలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. శిబిరంలో పాల్గొన్న డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వాళ్ల కి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. అలాగే కంటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రైనీ ఐ.పి.ఎస్ అయేషా మాట్లాడుతూ, రోడ్డు భద్రతలో కంటి చూపు అత్యంత కీలకమని, ముఖ్యంగా హెవీ వాహన డ్రైవర్లు తమ కంటి ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుకోవాలని సూచించారు. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఇటువంటి శిబిరాలు భవిష్యత్తులో కూడా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.అలాగే యం. సుమన్ కుమార్, ఎ.సి.పి ట్రాఫిక్  మాట్లాడుతూ, డ్రైవర్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో పాటించాల్సిన రోడ్డు భద్రతా నియమాలు, జాగ్రత్తలు గురించి వివరించారు. రోడ్డుపై ప్రయాణించే ప్రజల ప్రాణాలు డ్రైవర్ల బాధ్యతలో ఉంటాయని, కాబట్టి ఏమరపాటు లేకుండా బాధ్యతాయుతంగా వాహనం నడపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ప్రాంతాలకు చెందిన ఆర్టిసి  డ్రైవర్లు సహా దాదాపు 300 మంది డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ట్రాఫిక్ విభాగ సిబ్బంది, హాస్పిటల్ వైద్యులు మరియు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎ.సి.పి రవీందర్ రెడ్డి , సిద్దిపేట వన్ టౌన్ సి.ఐ వాసుదేవరావు , టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ , త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ,రాజు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *