నూతన చైర్ పర్సన్ ను కలిసిన తాపీ కార్మిక సంఘం నాయకులు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన దావ స్వాతి రమేష్ బాబును తెలంగాణ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి తెలంగాణ తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు దాసరి బానయ్య మాట్లాడుతూ.. మేము పిలువగానే వెంటనే స్పందించి మాకు టైం కేటాయించిన చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తాపీ కార్మిక సంఘం బెల్లంపల్లి అధ్యక్షుడు దాసరి బాలయ్య, ఉపాధ్యక్షుడు కాంపెల్లి నారాయణ, ప్రధాన కార్యదర్శి గోమాస రమేష్, ఆవునూరి రాజు, ముఖ్య సలహాదారు కత్తెర్ల లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.





