ప్రాంతీయం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత 

160 Views

గాగిల్లాపూర్-చిన్నకోడూరు

ఆగని ఇసుక అక్రమ దందా

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 24, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకిమండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు ఇసుక మండలేతర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా జోరుగా తరలుతోంది.మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని గాగిల్లాపూర్ గ్రామ మోయతుమ్మెద వాగు నుంచి చిన్నకోడూరు మండల పరిధిలోని అయా గ్రామాలకు రవాణదారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.కోహెడ మండలం శనిగరం గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషనుకు తరలించారు.ఇసుకును అక్రమంగా రవాణ చేస్తే చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని ఎస్ఐ అభిలాష్ తెలిపారు.అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ యొక్క ఇసుక అక్రమ దందా సాగుతోందని.. అధికారులు నిర్లక్ష్యం వీడి అరికట్టాలని వాగు పరివాహక రైతులు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *