ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా.
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





