ప్రాంతీయం

డాక్టర్ సుతి గోలి కి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం

47 Views

డాక్టర్ సుతి గోలి కి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం

మంచిర్యాల జిల్లా.

డాక్టర్ గైనకాలజిస్ట్/ సామాజిక కార్యకర్త డాక్టర్ శృతి గోలి  జన్మదిన వేడుకలో బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో సన్మానించినారు అనంతరం బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు  మాట్లాడుతూ
​వైద్య రంగంలో ఆమె కనబరుస్తున్న ప్రతిభ, రోగుల పట్ల ఆమెకు ఉన్న అంకితభావం అభినందనీయం. తన వృత్తి జీవితంలో ఎన్నో క్లిష్టమైన కేసులను విజయవంతంగా పూర్తి చేసి, ఎందరో ప్రాణాలను కాపాడిన డాక్టర్ శృతి, ఇటీవల ఎన్నో అవార్డు అందుకున్నారు
“డాక్టర్ శృతి గోలి  కేవలం మంచి వైద్యురాలే కాదు, అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి. ఆమె సేవలు సమాజానికి ఎంతో అవసరం. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము” అని ఆకాంక్షించారు.
​వృత్తిపరమైన బాధ్యతలే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోనల్ ఇంచార్జ్ కాదాసీ రవీందర్, జిల్లా ఇంచార్జ్ దాగం శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, తిరుపతి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *