ప్రాంతీయం

మంచిర్యాలలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

16 Views

మంచిర్యాలలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ.

మంచిర్యాల: తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన జిల్లా క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కుమార్ దీపక్  క్యాలెండర్‌ను విడుదల చేసి సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
జిల్లా స్థాయి కార్య‌క్ర‌మం ఉత్సాహభ‌రిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ మాట్లాడుతూ, నాల్గవ తరగతి ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఉద్యోగుల ఐక్యతే సంఘానికి బలం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోవర్ధన్ కోశాధికారి , శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీలత, ఉపాధ్యక్షురాలు మరియు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. వారు సంఘం భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు కలెక్టర్ కి మరియు డి సి పి  భాస్కర్ సార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ఉద్యోగుల సంక్షేమం కోసం కలెక్టర్  అందిస్తున్న సహకారం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *