ఎల్లారెడ్డిపేట అక్టోబర్.21 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అద్యక్షులు వరస కృష్ణహారి అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ. ఆవరణలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జి బాల్రెడ్డి తండ్రి భీమ్ రెడ్డి కి , 47 వేల రూపాయలు, సదియా భర్త మొహమ్మద్ హుస్సేన్ 45 వేల రూపాయలు , వి లక్ష్మణ్ తండ్రి గోపయ్య , 25 వేల రూపాయలు , ఎస్ కవిత భర్త దేవరాజు 25వేల రూపాయలు, జి మణెమ్మ జి రామ్ రెడ్డి కి, 60 వేల రూపాయలు, జి లక్ష్మి భర్త వెంకట్ రెడ్డి కు 55 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వరస కృష్ణా హరి ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు కలిసి సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందించి మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండపేద ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ సభ్యులు ఎలగందుల అనసూయ నరసింహులు వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మీనారాయణ , కోడుమోజు దేవేందర్ , జవాజి లింగం , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , టిఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా ఓన్నిషా , యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం , మేగి నరసయ్య , ఎలగందుల బాబు , బొల్లి భూమయ్య యాదవ్ , శ్యామంతుల అనిల్ , తదితరులు పాల్గొన్నారు





