105 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి 17 (24/7న్యూస్ ప్రతినిధి)
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) జన్మదిన వేడుకలను మంగళవారం రోజు ముస్తాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణతల్లి కూడలిలో వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ

నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బిఆర్ఎస్ నాయకులు మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పాత్రను స్మరించుకుంటూ ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతని కొని యాడారు. రైతు, విద్యార్థి, మహిళ, నిరుద్యోగ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దూరదృష్టి గల నాయకుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found