ప్రాంతీయం

మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్.

45 Views

 

మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్.

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7

మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్దిపేట పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, శుక్రవారం గజ్వేల్, చేర్యాల, దుబ్బాక పట్టణాల్లోని కౌంటింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, సీసీ కెమెరాల నిఘా సిబ్బంది మోహరింపును సీపీ తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధ పోలీసులతో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు . అభ్యర్థులు  రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ పర్యటనలో గజ్వేల్ ఏసీపీ, సిద్దిపేట ఏసిపి , స్థానిక సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *