ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు పెన్నిధి, అనారోగ్యబారిన పడినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిందం శశికాంత్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రానికి చెందిన గూని విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా కోలుకున్నాడు. అనంతరం తనకు ఆసుపత్రిలో ఖర్చయిన డబ్బులు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి డబ్బులు మంజూరు చేయడం జరిగిందన్నారు. విజయ్ కి సీఎం సహాయనిధి చెక్కు అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిది అంటే పేద మధ్య తరగతి కుటుంబాల నిధి అని అనారోగ్యంతో భాదపడుతున్న పేద మధ్య తరుగుతుల వారికి ఆర్ధిక వేసులు బాటు అవుతుందని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం సహాయనిధి చెక్కుల విషయంలో అవినీతి పాల్పడిందని విమర్శించారు. మాది ప్రజా ప్రభుత్వమని దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో భాదితులకు తక్షణమే అందచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి తుడుం ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.





