ప్రాంతీయం

అన్ని మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష

21 Views

అన్ని మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర)లో ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చేయడానికై అన్ని మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చెయ్యాలని ఈ విద్య సంవత్సరం లో వచ్చే ఫలితాల ఆధారంగానే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు చేరతారని ప్రతి మండలంలో ఒక ప్రణాళిక రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారీ శ్రీనివాస్ రెడ్డి ను ఆదేశించారు.రాబోయే 10 వ తరగతి విద్యార్థుల బాగా చదివించాలని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ప్రత్యేక తరగతులు మరియు స్టడీ హవర్ లో విద్యార్థులకు దగ్గరుండి సబ్జెక్ట్ గూర్చి అవగాహన  సులభంగా ఎలా చదవాలో మెలకువలు నేర్పించాలని తెలిపారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ తీసుకుని చదివించాలని తెలిపారు.ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం మెనూ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థుల హాజరు ప్రకారం అందరికీ సరిపోయే విధంగా వండి రుచికరంగా వండి విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో సైతం మెను పాటించాలని, కొలత ప్రకారం అన్నం, కూరగాయలు చెయ్యాలని ఆదేశించారు.ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వేగం పెంచాలని ఆదాయ, కుల జారీలో ఆలస్యం అవుతున్నందున విద్యార్థుల పత్రాలు వెంటనే జారీ చెయ్యాలని తహసిల్దార్ లను ఫోన్ ద్వారా ఆదేశించారు. మీ సేవ సెంటర్ లో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలకు అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ డి ఎం ఆనంద్ కి ఫోన్ ద్వారా ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *