ప్రాంతీయం

ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలి

123 Views

 

ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలి

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 )

ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థలలో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 తరగతులలో ఖాళీల ప్రవేశాలకు, టీ జి స్వేరిస్ గౌలిదొడ్డి, అలుగునూరు సీ ఓ ఈ, లలో 9వ తరగతి ప్రవేశాలు, టీజీ ట్వరేస్ ఖమ్మం, పరిగి ఎస్ ఓ ఈ, లలో,8వ తరగతి ప్రవేశాలు, టీజీ స్వరేస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను కామన్ ప్రవేశ పరీక్షకు (ఇంగ్లీషు మీడియం) జిల్లా నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందు కోసం దరఖాస్తులను https://tgcet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలన్నారు.అలాగే దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల జనవరి 21 అని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదిన ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనుటకు కావలసినవి:1. కులం సర్టిఫికేట్ నెంబరు 2. ఆదాయం సర్టిఫికెట్ నెంబరు 3. ఆధార్ కార్డు నెంబర్ 4. బర్త్ సర్టిఫికేట్ 5. ఫొటోలు ,సర్టిఫికెట్ల సత్వర జారి కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *