ప్రాంతీయం

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో లెక్కింపు కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు..

29 Views

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో లెక్కింపు కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు….

సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7

తెలంగాణరాష్ట్రరెండవసాధారణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల ఫిబ్రవరి 13న సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని నాలుగుకేంద్రాలలో (చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక,గజ్వేల్,మున్సిపాలిటీ పరిధిలలో) జరగనుంది.ఈసందర్భంగాశాంతిభద్రతలను పరిరక్షించేందుకు లెక్కింపు కేంద్రాల వద్ద సిద్దిపేట పోలీస్ కమిషనర్ రశ్మి పెరుమాళ్ 163 బి ఎన్ ఎస్ ఎస్(గతంలో సెక్షన్144)ప్రకారంనిషేధాజ్ఞలు జారీచేయడమైనది.ఐదులేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులుగుమిగూడటం ఎటువంటి ఊరేగింపులు నిర్వహించడం నిషిద్ధం. లెక్కింపు కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలో కర్రలు, లాఠీలు, మారణాయుధాలు లేదా ఇతర ప్రమాదకర వస్తువులుతీసుకురాకూడదు.బహిరంగప్రదేశాల్లో,రహదారులపై షామియానాలు, పందిళ్లు లేదా వేదికలు ఏర్పాటు చేయరాదు.మైకులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ స్పీకర్ల ద్వారా పాటలు, ప్రసంగాలు ప్రసారం చేయడంపై పూర్తి నిషేధం విధించబడింది.మతపరమైన విద్వేషాలనుప్రేరేపించేప్రసంగాలు, సంజ్ఞలు, చిత్రాలు లేదా ప్లకార్డుల ప్రదర్శనను ఖచ్చితంగానిషేధించడమైనదిబాణసంచా కాల్చడం విజయ యాత్రలు నిర్వహించడం అనుమతించబడదు.మినహాయింపులు.ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి మాత్రమే ఈ ఉత్తర్వుల నుండి మినహాయింపు ఉంటుంది.అమలు కాలం:ఈ నిబంధనలు ఫిబ్రవరి 13 ఉదయం 06:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించేవాళ్లపైచట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ,హెచ్చరించారు.శాంతియుత వాతావరణంలో ఓట్లలెక్కింపుప్రక్రియముగిసేలాప్రజలందరూసహకరించాలని కోరడమైనది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *