ప్రాంతీయం

దుబ్బాక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లచ్చపేట లోని తెలంగాణ మెడల్ స్కూల్  జూనియర్ కళాశాల లో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కె. హైమావతి

43 Views

2 వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 ప్రక్రియలో భాగంగా..

దుబ్బాక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లచ్చపేట లోని తెలంగాణ మెడల్ స్కూల్  జూనియర్ కళాశాల లో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, హైమావతి

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 10, తెలుగు న్యూస్ 24/7

2 వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 ప్రక్రియలో భాగంగా మంగళవారం దుబ్బాక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లచ్చపేట లోని తెలంగాణ మెడల్ స్కూల్  జూనియర్ కళాశాల లో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు అయేషా మాస్రత్ ఖానం తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.పోలింగ్ సిబ్బంది మీకు అందజేసిన పోలింగ్ సామాగ్రిని అన్ని చెక్ చేసుకోవాలని బ్యాలెట్ పేపర్ కౌంట్ చేసుకోవాలని తెలిపారు. అలాగే బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే విధానం తో పాటు లాక్ వేయడం, అన్ లాక్ ప్రక్రియ గూర్చి ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించుకోవాలని సూచించారు.మీ రూట్ లో పోలింగ్ స్టేషన్ కి వెళ్ళక ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం పోలింగ్ ప్రక్రియకు ఫర్నిచర్,లైటింగ్, బూత్ ఏర్పాటు పోలింగ్ సరళి సహవుగ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ఈ రోజు రాత్రి భోజనం, రేపు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ, స్నాక్స్ పోలింగ్ సిబ్బందికి అందించాలని అధికారులను ఆదేశించారు.రేపు ఉదయం మాక్ పోల్ పూర్తి చేసుకుని 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలని తెలిపారు. మిగిలిన ఓటర్ స్లిప్ లు బిఎల్ఓ లు పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల బయట పంపిణీ చెయ్యాలని లోపలికి బిఎల్ఓ లను అనుమతించకూడదని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ లో ఎలాంటి సమస్య ఎదురైనా మీకు అందజేయబడిన కరదీపిక ను చూసి పరిష్కరించుకోవాలని తెలిపారు.అనంతరం మెడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ మరియు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చెయ్యాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ను ఆదేశించారు, జిల్లా కలెక్టర్ వెంట ఎంపిడిఓ భాస్కర శర్మ, తహసిల్దార్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *