ప్రాంతీయం

సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి

26 Views

సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  

 సిద్దిపేట జిల్లా జనవరి 17, తెలుగు న్యూస్ 24/7  

సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం కోహెడ మండలంలో గల సింగరాయకొండపై గల సింగరాయ ప్రతాపరుద్ర లక్ష్మీనరసింహస్వామి జాతర ఈనెల 18వ తేదీన ఆదివారం నాడు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రకృతి ప్రసాదించిన అందమైన కొండల మధ్య కొలువై భక్తుల కొంగుబంగారంగా పిలవబడే లక్ష్మీ నరసింహ స్వామిని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, హైదరాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, మహారాష్ట్ర నుండి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు సౌకర్యం, భక్తులు స్వామివారిని ప్రశాంత వాతావరణంలో స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. తూర్పు నుండి పడమరకు ప్రవహించే నదులలో మాఘమాస స్నానాలు చేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు అడవులు, కొండల నుండి ప్రవహించే మోయతుమ్మెద వాగులో ఔషధ గుణాలు గల నీటిలో స్నానం చేయడం ఆ నీటితో పండగ సందర్భంగా వండే ప్రత్యేకమైన శాఖాహార వంటకం చిక్కుడుకాయ, టమాట, వంకాయ కూరను భుజించడం వలన ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *