ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష….

53 Views

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష….

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు….

సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 10, తెలుగు న్యూస్ 24/7 

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా ఆరుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసి 06 ఆరుగురిలో నలుగురికి రూ.40,000- జరిమానా , ఒక వ్యక్తికి ఐదు (05) రోజులు మరొక వ్యక్తికి రెండు (02) రోజులు జైలు శిక్ష విధించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని ఒక వ్యక్తికి రూ. 5,000- జరిమాన.జైలు శిక్ష విధించిన వ్యక్తి వివరాలు.1.మితలేష్ కుమార్, వయసు 32 సం,వృత్తి. లారీ డ్రైవర్, నివాసం బీహార్ రాష్ట్రం.ఐదు రోజులు జైలు.2. గోసిక నారాయణ, వయసు 45   వృతి.కూలీ,నివాసంకాళ్లకుంట కాలనీ, సిద్దిపేట పట్టణం. రెండు రోజులు జైలు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమనిప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.పదివేలరూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించివాహనాలునడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహనరావడంజరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000-రూపాయలజరిమానా విధించడంజరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడంజరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *