ప్రాంతీయం

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

19 Views

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 10, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోసం నోటిఫై చేయబడిన ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, కర్మాగారాలకు పోలింగ్ రోజున ఆయా సంస్థలలో పని చేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా వేతనంతో కూడిన సెలవు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజున వినియోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు పోలింగ్ నిర్వహణ కోసం స్థానిక సెలవులు ఉపయోగించబడతాయని తెలిపారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *