మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఒడ్డెర కాలనీ లో 20,21,49,50,51 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్ రావు .
అనంతరం వారు మాట్లాడుతూ 20,2149,50,51 డివిజన్ల కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలందరికీ కోరారు.
అనంతరం యువ నాయకులు దాదాపు 30మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.





