ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం…
-డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలి…
జిల్లా కలెక్టర్ కె హేమావతి…
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హౌసింగ్ టు బిహెచ్కె హౌస్ లనునిర్మించిన ఆర్&బి, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులను గృహ నిర్మాణ శాఖకు అందించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ సంబంధించిన పూర్తి వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలని అన్నారు. అదేవిధంగా నిర్మాణం పూర్తయిన టు బిహెచ్కె లను అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఈడబ్ల్యుఐడీసీ ఇఇ లు, హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





