ప్రాంతీయం

వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనికి

132 Views

వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనికి

సిద్దిపేట జిల్లా, వర్గల్, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7

వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆహార పదార్థాలు అన్నం,గుడ్డు, శామగడ్డ కూర, పాలకూర పప్పు, రసం, నెయ్యి లను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థుల హాజరు ప్రకారం అందరికీ ఆహారం సరిపోయే విధంగ రుచికరంగా వండాలని, పిల్లలకు మరల అన్నం కూరలు వళ్ళు కూర్చున్న వద్దకు వెళ్లి వడ్డించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించారు. ఆహారం బాగా నమిలి తినాలని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక్క మెతుకు కూడా పడేయకూడదని, ఆహారం సరిపోయేంత తింటేనే శారీరకంగా దృఢంగా ఉంటారని రోజు చదువుతో పాటు ఆటలు సైతం ఆడాలని విద్యార్థులకు తెలిపారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సరుకులు ఇవ్వగానే రాయాలని ఒకే సారి రాస్తాను అని నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. పిల్లలకు భోజనం, వసతి, చదువు విషయం లో రాజీ పడవద్దని మంచి క్రమశిక్షణ తో విద్యాబుద్ధులు నేర్పించాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *