ప్రాంతీయం

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘కనువిప్పు’ కార్యక్రమం

34 Views

చిన్నకోడూరు మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘కనువిప్పు’ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7

చిన్నకోడూరు మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘కనువిప్పు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మరియు మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మహిళా భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. శాంతియుత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ పరశరామ్ , గ్రామ పెద్దలు మరియు సుమారు 200 మంది గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *