ప్రాంతీయం

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ పైకమిషనర్ రష్మీ పెరుమాళ్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు సబ్-ఇన్‌స్పెక్టర్లతో సుదీర్ఘ సమీక్షా

25 Views

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ పైకమిషనర్ రష్మీ పెరుమాళ్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు సబ్-ఇన్‌స్పెక్టర్లతో సుదీర్ఘ సమీక్షా

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు సబ్-ఇన్‌స్పెక్టర్లతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా తీవ్రమైన నేరాలు  మహిళలపై జరిగే వేధింపుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ వాహనాల గస్తీని పెంచాలని సూచించారు. అనుమానిత వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి గ్రామంలో  పట్టణ ప్రాంతాల్లో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వాళ్ల సమస్యలను విని తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం , బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేయడం , ఈ పెట్టీ కేసులలో జరిమాన తో పాటు జైలు శిక్ష తప్పదని తెలియజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోలోని వాహనాలను తనిఖీ చేశారు.ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ విభాగాల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు  ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *