జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ సెంటర్ వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ -2023 సెక్షన్ అమలు..
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్., ఐపిఎస్
సిద్దిపేట జిల్లా, వర్గల్, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిదవ , పదకొండవ తరగతి గాను జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్ష – 2026 మొత్తం 08 పరీక్షా కేంద్రాలలో జరగనున్నది , 1. సెట్. మేరీ విద్యానికేతన్ – ప్రజ్ఞాపూర్, 2.( జెడ్ పి హెచ్ ఎస్ ) ఆర్ అండ్ ఆర్ కాలనీ, గజ్వేల్, 3. (జెడ్ పి హెచ్ ఎస్ ) గర్ల్స్ హబ్ , గజ్వేల్ , 4. తెలంగాణ మోడల్ స్కూల్ గజ్వేల్.,5. ప్రభుత్వ హైస్కూల్ గజ్వేల్., 6. (జెడ్ పి హెచ్ ఎస్) బాయ్స్ ప్రజ్ఞాపూర్ ., 7. ఎస్ టీ. జోసెఫ్ గర్ల్ హై స్కూల్ , గజ్వేల్ , 8. జవహర్ నవోదయ విద్యాలయ, వర్గల్ కేంద్రాల వద్ద ఫిబ్రవరిిి 7ఉదయం 08:00 నుండి సాయంత్రం 04:00 వరకు సెక్షన్ 163 (బి ఎన్ ఎస్ ఎస్ ) 2023 విధించనైనది., పరీక్ష సెంటర్ నుండి 500 మీటర్లు పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడ వద్దని సూచించడమైనది.పై నిబంధనలు ఉల్లంఘించే ఏ వ్యక్తినైనా చట్టం ప్రకారం ప్రాసిక్యూట్ చేసి శిక్షార్హులుగా పరిగణించబడుతుందని ప్రజలకు తెలియజేయడమైనది.





