ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..

26 Views

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా విచారణ చేసి 04 నలుగురిలో ముగ్గురికి రూ.31,000- జరిమానా , ఒక వ్యక్తికి మూడు రోజులు జైలు శిక్ష విధించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని ఒక వ్యక్తికి రూ. 5,000- జరిమాన విధించారు.జైలు శిక్ష విధించిన వ్యక్తి వివరాలు.జంగిటి రవీందర్, వయసు 35 , వృత్తి. డీసీఎం డ్రైవర్ నివాసంగోనెపల్లి,చిన్నకోడూరు మండలం సిద్ధిపేట జిల్లా.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ల కి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమనిప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.పదివేలరూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించివాహనాలునడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన రావడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000- రూపాయల జరిమానా విధించడంజరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడంజరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *