బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
సిద్దిపేట్ జిల్లా మార్కుక్ మండల్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి యువకుడు మృతి చెందాడు ఈ సంఘటన పాములపర్తి గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు బంధువులు కథనం ప్రకారం పాములపర్తి ఎస్సీ కాలనీ కి చెందిన మధు కార్తిక్ ఇద్దరు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తామని కుటుంబీకులకు చెప్పి వెళ్లారు గ్రామ సమీపంలోనే కొండపోచమ్మ సాగర్ సమీపంలో కాల్వ వద్ద చెట్టు ను ఢీకొని అక్కడికక్కడే మధు మృతి చెందాడు కార్తీక్ 15 తలకు బలమైన గాయాలు కావడంతో సమీపంలోని ఉన్న ఆర్ వి ఎం ఆసుపత్రికి తరలించారు ఈ విషయంపై ఎస్సై వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేసు నమోదు చేయలేదని తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెంది నా విషయం తెలుసుకున్న ఎంపీపీ పండు గౌడ్ మధు కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు చిన్నతనంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీపీ పాండుగౌడ్ తెలిపారు
