ప్రాంతీయం

రెవెన్యూ రికార్డుల నిర్వహణ మరియు ప్రభుత్వ భూముల సంరక్షణ సక్రమంగా చేయాలి..

18 Views

రెవెన్యూ రికార్డుల నిర్వహణ మరియు ప్రభుత్వ భూముల సంరక్షణ సక్రమంగా చేయాలి..

జిల్లా కలెక్టర్ కే. హైమావతి..

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7

జిల్లా కలెక్టర్ ఐడిఓసిసమావేశ మందిరంలో ఆర్డీవోలు అన్ని మండలాల తాసిల్దార్లతో అధికారులతో సమావేశం నిర్వహించిగ్రామాలు,మండలాలు డివిజన్ల వారీగా వివిధ రెవెన్యూఅంశాలపైసమీక్షించారు. ముఖ్యంగా భూభారతి దరఖాస్తులు తాసిల్దార్ నుండి జిల్లా కలెక్టర్ లాగిన్ వరకు గల పెండింగ్ దరఖాస్తులను పరిష్కారించడం ప్రభుత్వ భూముల పరిరక్షణపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చాలాముఖ్యమైనదని అన్నారు. భూ సంబంధిత సమస్యలు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనేసమస్యలలోఒకటిగా ఉంటుందని అన్నారు. భూ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టంనుపారదర్శకంగాఅమలు చేసి భూ సమస్యలు లేకుండా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అని అన్నారు. చట్టం ప్రకారం భూభారతి పెండింగ్ దరఖాస్తు లపరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చిక్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా దరఖాస్తుల త్వరగా అన్ని స్థాయిలలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకొని రెవెన్యూ వ్యవస్థ పై ప్రజలలో మర్యాదపెరిగేలాచర్యలుతీసుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ రెవిన్యూ అధికారుల ముఖ్యమైన బాధ్యత అని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్ఓ ఆర్, 1బి తదితర అన్ని రకాల రెవెన్యూ రికార్డులనుపక్కాగానిర్వహించాలనిసూచించారు.త్వరలోనే రెవెన్యూ రికార్డులపై డిప్యూటీ తాసిల్దార్లకు ప్రత్యేక సమీక్షసమావేశంనిర్వహించాలనిసూచించారు.ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓనాగరాజమ్మ,సిద్దిపేట, హుస్నాబాద్ఆర్డీవోలుసదానందం, రామ్మూర్తి, జిల్లాలోని అన్నిమండలాలతాసిల్దారులుఈడియం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *