ప్రాంతీయం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ

37 Views

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు..

జిల్లా కలెక్టర్ కె హైమావతి…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7

దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు.అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, ఆలుగడ్డ, టమాటాలను పరిశీలించారు. మెను పాటిస్తున్నారు కానీ కూరలు ఏ పాఠశాల చూసినా సాంబారు మాదిరిగా పలచగా ఉన్నందున అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరిపడినంత ఆహార పదార్థాలు వండేలా చర్యలు తీసుకోవాలని, చేసిన వంటలు నాణ్యతగా రుచికరంగా లేకపోతే ఉపేక్షించేది లేదని ప్రిన్సిపల్ లనుఆదేశించారు.విద్యార్థులకు పౌష్టికాహారంఅందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని విధులు సక్రమంగా నిర్వహించాలని లేకపోతే కఠినచర్యలు తప్పవని ఆదేశించారు.అనంతరం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనికి చేశారు. పిల్లలకు ఆహారాన్ని తినేలాగా చూడాలని తిన్న తరవాత ఆడుకోడానికి ఆట వస్తువులు లేకపోతే పడుకోబెట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *