రాయపోల్ మండల పరిధిలోని రామ్ సాగర్ గ్రామ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఆయిల్ పామ్ సాగు లాభాలు గురించి రైతులకు అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి నరేష్. ఆయిల్ పామ్ పంట పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు డ్రిప్ పై 90-95% వుంది అని, మొక్కలు కూడా సబ్సిడీ పై అందుబాటులో వున్నవి అని అదే విధంగా ఆయిల్ పామ్ వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు మొత్తం 42,000 రైతుకు ప్రోత్సాహకంగా ఇవ్వటం జరుగుతుంది అని తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆయిల్ పామ్ కు టన్ కు 19,000 రూపాయలు వుంది అని అవరేజ్ గా ఆయిల్ పామ్ 10-15 టన్నులు వస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏఈఓ ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.




