ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 1,, మండలంలోని నామాపూర్ గ్రామ పంచాయతీ పరిదిలోని తాగునీటి కష్టాలు అంతో ఇంతో కాదు ఆరు నెలల కాలంగా సమస్యల వలయంగా మారింది. కుళాయిలు మూగవోయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు అదిగో గడ్డి ఇదిగో మైదానం అన్నట్లు సామెతగా మిగిలిపోయింది కనీసం లోకల్ బోరు సరఫరా కాకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటిని సమీపంలోని వ్యవసాయ బోరుబావి నుండి నీటిని సేకరించి తాగాల్సి వస్తుందని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ విషయమై మిషన్ భగీరథ తాగునీరు గురించి స్థానిక గ్రామ సర్పంచ్ సెక్రెటరీ దృష్ఠికి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకోవడంతో చేసేదేంలేక సంబంధిత గ్రామపంచాయతీ డోర్ కు వినతిపత్రం సమర్పించి తమ ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ లేదా గ్రామ కులాయిల నీళ్లు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇలాగనే కొనసాగితె ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా బిందెలతో ఎస్సీ కాలనీ వాసులమందరం కలిసి నిరసన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.
