ప్రాంతీయం

అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి

16 Views

అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి.

జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఈ.రాజేశ్వర్

మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 4, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఈ.రాజేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి పురపాలక సంఘ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఖర్చుల నిర్వహణపై ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు మందమర్రి సి ఐ రమేష్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ లతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, నిర్దేశించిన పరిమితి లోపు ఖర్చులు చేయాలని తెలిపారు. అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల నిర్వహణ కొరకు బ్యాంకు ఖాతా, లావాదేవీలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు తమ మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 6, 9 తేదీలలో తమ బ్యాంకు ఖాతా పరిశీలన చేసుకోవాలని, నిర్దేశిత పరిమితిని మించి ఖర్చులు చేయకూడదని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ. రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *