మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కే. హైమవతి..
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7
సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 నిర్వహణలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోజిల్లాలోఎన్నికలు జరగనున్నచేర్యాల,హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదర్ పోలింగ్ సిబ్బందిని రెండవ విడత ర్యాండమైజేషన్ పద్ధతిలోఆన్లైన్లోకేటాయించారు. చేర్యాల మున్సిపాలిటీకి 122 మంది సిబ్బందిని, హుస్నాబాద్ మున్సిపాలిటీకి 200 మంది సిబ్బందిని, దుబ్బాక మున్సిపాలిటీకి 205 మంది సిబ్బందిని,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 364 మంది సిబ్బందిని కేటాయించారు.వీరితోపాటుగా ప్రతి మున్సిపాలిటీకి 20 శాతం అదనపు (రిజర్వ్) ఎన్నికలపోలింగ్అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. వీళ్ళ కి ఈనెల 7వ తేదీన ఐడిఓసి సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.అలాగే ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందిని కూడా రాండమైజేషన్ ద్వారా కేటాయించారు. చేర్యాల మున్సిపాలిటీకి 26 మంది సిబ్బందిని, హుస్నాబాద్ మున్సిపాలిటీకి 26 మంది సిబ్బందిని, దుబ్బాక మున్సిపాలిటీ 26 మంది సిబ్బందిని మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 40 మంది సిబ్బందిని వీరితోపాటు 20% అదనపు (రిజర్వ్) సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో నియమించారు. ఈ కౌంటింగ్ సిబ్బందికి ఈనెల 9 వ తేదీన ఐడిఓసి సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మష్రత్ ఖానం ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్యా, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది మాస్టర్ ట్రైని రామస్వామి, ఎలక్షన్ విభాగం అధికారులు, ఈడియం ఆనంద్ టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





