ప్రాంతీయం

మార్కుక్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

100 Views

మార్కుక్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట జిల్లా, మార్కుక్, ఫిబ్రవరి 3, తెలుగు న్యూస్ 24/7

జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్  సిబ్బంది ఎఎన్ఎం లను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు.మార్కుక్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల అన్ని గదులు తనికి చేశారు. ఇప్పటివరకు ఎంత ఓపి చూశారని మెడికల్ ఆరా తీశారు. వైద్య పరికరాలు మందులు సమకూర్చుకుని రోగులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు సమయవేళలు పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.ఆయా గ్రామాల్లోని గర్భస్థ మహిళల ఆరోగ్య స్థితి గతులను పర్యవేక్షణ చెయ్యాలని ప్రతి గర్భిణీ ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రికి ఒక్క మహిళ కూడా వెళ్లకుండా పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్ ఏ ఎన్ ఎం లను ఆదేశించారు. అన్ని జిల్లా జనరల్ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డాక్టర్ మరియు సిబ్బంది పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా డి ఎం అండ్ ఎచ్ ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *