ప్రాంతీయం

మార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తన్నికి

166 Views

మార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తన్నికి

సిద్దిపేట జిల్లా, మార్కుక్, ఫిబ్రవరి 3, తెలుగు న్యూస్ 24/7

మార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, క్యారెట్ కూర, పప్పు, సాంబారు లను తనికి చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరుకులు అందించారా అని ఆరా తీశారు. కొలత ప్రకారం ఇచ్చిన కూరగాయలు చేసిన వంటకు అస్సలు పొంతనే లేదని ఎస్ఓ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ చెక్ చేశారు. రిజిస్టర్లో రాయకుండా ఇష్టానుసారంగా కూరగాయకు సరుకులు అందిస్తారా అని మండిపడ్డారు. ఏదో వంట మొక్కుబడిగా ఎంతో కొంత అన్నం కూరలు చేసి పిల్లలకు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట చేయలేదని రిజిస్టర్ రాయనందుకు గాను ఎస్ ఓ పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా డీఈఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. తరుచు కేజీబీవి నీ విసిట్ చెయ్యాలని ఏం ఈ ఓ ను ఆదేశించారు. రోజు మెనూ పాటిస్తూ విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు మరల ఆహారం కూర్చున్న వద్దకు వెళ్లి వడ్డించాలని విధుల్లో నిర్లక్ష్యం ప్రతి ఒక్కరి పైన యాక్షన్ తప్పదని విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *