ప్రాంతీయం

లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు..

22 Views

లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు..

సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7

లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.శనివారం జిల్లా కోర్టు హాల్లో జిల్లా జడ్జి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి లోక్ అదాలత్ ల ద్వారా పరిష్కరించుకోవడానికి వీలున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు తదితర కేసులను కక్షిదారుల సమ్మతితో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజీ మార్గం రాజ మార్గం అని, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ లేకుండా లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్నదని తద్వారా కక్షిదారుల సమయం వృధా అవ్వడమే కాకుండా లబ్ది కూడా సత్వరమే జరగడంతో లబ్ధి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ మొదటి లోక్ అదాలత్ కార్యక్రమం కోసం జిల్లా కోర్టులో ఏడు బెంచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల కోర్టులలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కక్షిదారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు..

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *