మంచిర్యాల
రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు.
తేదీ 11.4.2024 గురువారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాములు చెరువు కట్ట వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో బడుగు బలహీన అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి విశేష కృషి చేసిన సంఘసంస్కర్త సామాజిక ఉద్యమ నాయకుడు జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి కన్న ముందు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పలువురు వాకర్స్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై ప్రజలను చైతన్యం చేసిన జ్యోతిబా పూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించాలని అదేవిధంగా బాల్య వితంతు వివాహాలను నిర్మూలన సతీసహగమనం వంటి దురాచారాలపై ప్రజలను విశేషంగా చైతన్యవంతం చేసిన మహనీయుడని కొనియాడారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే కౌశ్య విగ్రహాన్ని ప్రభుత్వం నెలకొల్పాలని విజ్ఞప్తి చేసినారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, తాలిబ్ ఖాన్, జాయింట్ సెక్రటరీ రామ్ రెడ్డి, సాగర్ల రవి కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, ఏ మాజీ వోజ్జల మనోహర్ రావు,చారి, రెడ్డన్న, ఎం తిరుపతి, సలహాదారులు డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ త్రినాధరావు డాక్టర్ సల్మాన్ రాజు, జి ఎస్ ఎన్ మూర్తి ,బి మోహన్ రావు, ఎన్ ఆర్ శ్యామ్ రావుల ప్రతాపరెడ్డి ,రాంరెడ్డి టీచర్, కిరణ్ జి ఎస్ ఎన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే కు మా జోహార్లు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసినారు.





