ప్రాంతీయం

బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ కి సమ్మె నోటీసు అందజేసిన

40 Views

బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ కి సమ్మె నోటీసు అందజేసిన

గ్రామ పంచాయతీ కార్మికులు 

సిద్దిపేట్ జిల్లా, ఫిబ్రవరి 3, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్ కి గ్రామపంచాయతీ కార్మికులకు సమ్మె నోటీసుని అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా నాయకులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నామని ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చిందని దీనివల్ల కార్మిక వర్గం తీవ్రమైన సంక్షోభంలోకి పోతుందని అన్నారు.పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలి. వేతనాలకు బడ్జెట్ కేటాయించాలి. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి, పంచాయితీ సిబ్బందిని కూడా 2వ పిఆర్ సీ పరిధిలోకి తీసుకురావాలి., పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇన్యూరెన్స్, ఈఎస్ఐఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని,అలాగే వేతనాలు చెల్లించాలని పంచాయితీల అవసరాల ప్రాతిపాదికన కార్మికుల సంఖ్యను పెంచాలని, కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి,అనారోగ్యానికి గురై చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు రూ.10,000-లు కాకుండా రూ.20,000-లు ఇవ్వాలి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ కార్యదర్శి శివకుమార్ , లక్ష్మణ్ సిఐటియు నాయకులు సంఘ ఎల్లయ్య , బోనగిరి లింగం , వినోద్, సంపత్, స్వామి, మల్లేశం, లక్ష్మణ్ ,పరశురాములు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *