ప్రాంతీయం

మినరల్ వాటర్ కోసం గ్రామ ప్రజల ఇక్కట్లు

157 Views

సుమారు రెండు నెలలు మినరల్ వాటర్ కోసం గ్రామ ప్రజల ఇక్కట్లు

నూతన పాలకవర్గం రాకతో వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం 

కొబ్బరికాయ కొట్టి పునః ప్రారంభించిన సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య 

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 2, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ దాదాపూ 2000 మందిపైగా ప్రజల దాహార్తిని తీర్చే శుద్ధ జల కేంద్రం ( వాటర్ ప్లాంట్) గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.గ్రామపంచాయతీ ఆవరణలో గల వాటర్ ప్లాంట్ గత కొన్ని రోజుల నుండి శుద్ధ జల కేంద్రం నడవక ఈ యొక్క వాటర్ ప్లాంట్ నుండి గుగ్గిళ్ల, తిమ్మాయపల్లి గ్రామాల ప్రజలు ఈ యొక్క మినరల్ వాటర్ ని తాగుతుంటారు.గత కొన్ని రోజుల నుండి నడవకపోవడంతో వేరే గ్రామానికి వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడింది. గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఏర్పాటు అవడంతో సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య, ఉపసర్పంచ్,వార్డు ప్రజలు కృషితో మళ్లీ వాటర్ ప్లాంట్ సోమవారం గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, వార్డు ప్రజలు గ్రామ ప్రజలతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.మినరల్ వాటర్ పున ప్రారంభం రావడానికి కృషిచేసిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ శంకర్ బాబు, చిట్టి లక్ష్మయ్య, దూసెట్టి తిరుపతిరెడ్డి, దుగ్యాని మోహన్, మైల బాలయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *