ప్రాంతీయం

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 

98 Views

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం

-ఈనెల 26వ తేదీ నుండి నాలుగు పథకాలు అమలు 

-మర్కుక్ మండల తహశీల్దార్ ఆరీఫా అన్నారు. 

 సిద్దిపేట జిల్లా మర్కుక్ జనవరి 22

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుండి నాలుగు పథకాలు అమలు జరగబోతుందని, మర్కుక్ మండల తహశీల్దార్ ఆరీఫా అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో తాహసిల్దార్ ఆరీఫా మాట్లాడుతూ, గ్రామంలోని ప్రజలకు అభిప్రాయాలను స్వేకరించడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు అందరికీ ఈ పథకాల ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం,అని ఈ నాలుగు పథకాలు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ,ఆత్మీయ, భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, భూములు లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ప్రభుత్వo అందజేస్తుందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడిన 2023 2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరించి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్పడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశము అని అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12 వేల రూపాయలు పెంచడం జరిగిందని వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈనెల 26వ తేదీ నుండి అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ భూములకు సహాయం వర్తించదు అని అన్నారు. గ్రామంలో ప్రతి రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన ప్రతి నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాటు చేస్తాన్నామని అదనపు కుటుంబ కుటుంబ సభ్యులను చేర్చడానికి గ్రామ సభలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయని గ్రామసభకు హాజరు కాలేని ప్రజలు,మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని,

వీటిని కూడా పరిశీలన చేయబడుతుందని పరిశీలన చేయబడును పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు ఛార్జ్ చేయబడతాయని అన్నారు, గత గ్రామసభలో మన గ్రామంలో ఇంజనీరింగ్ నుంచి దరఖాస్తు స్వీకరించామని అట్టి దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇండ్లు కట్టుకోవడం కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీయడం జరిగిందని 45 ఏళ్ల లోపు ఉన్న యువ వితంతువులకు పారిశుద్ధ కార్మికులకు అంగవైకల్యం, భూములు, లేని నిరపేదలకు ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు మరియు ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరిగిందని ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నామని అన్నారు. మీ ముందు ఉంచిన వివరలు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నామని అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరని అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయనివారు చేసినా కూడా జాబితాలో లేని వారు జాబితాలో పేరు లేని వారు గ్రామసభలో దరఖాస్తు చేసుకోవచ్చని లేనిచో మండలం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో కేంద్రంలో దరఖాస్తు చేసుకోగలరని అన్నారు. వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన నిరుపేదల అందరికీ ఇండ్లు,మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ షేక్ అరిఫా, ఆర్ ఐ యాదగిరి, గ్రామ సెక్రెటరీ సిద్దేశ్వర్, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బూరి రాందాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మర్కుక్ మండల అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి మాజీ సర్పంచ్ తిరుమలరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్