ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, ఇంటి పెద్ద అకాల మరణంతో వీధినపడ్డ కుటుంబాన్ని చిన్ననాటి స్నేహితులు ఆదుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ముస్తాబాద్ మండలంలోని చుంచు గట్టయ్య అనారోగ్యంతో ఇటీవల పరమపదించగా అతని కుమారుడైన మళ్లీక్ నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. ఈసందర్భంగా ఎన్నారై రామ్ రెడ్డితో పాటు రాజగౌడ్ 1994-95 బ్యాచ్ చెందిన ఓకే పాఠశాలలో చదువుకొని బాల్యం నుంచి ఆనుబంధం
చదువుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసి తమవంతు సాయంగా ఒక క్వింటాల్ బియ్యాన్ని సహాయంగా అందించారు. అదేవిధంగా ఇంకెవరైనా తమవంతు సహాయంగా తమకు తోచినంత వారు సహాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వీరితోపాటు ఈర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.




