ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

33 Views

 

మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 41,000/- జరిమానా

డ్రైవింగ్ లైసెన్స్ లేని 06 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 30,000/- జరిమాన.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు

సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవాారం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి 04 నలుగురికి 41,000/- జరిమానా విధించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని 06 ఆరుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 30,000/- జరిమాన.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం మరియు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్  విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పదివేల రూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన రావడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000/- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *