సీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం
జ్యోతి ప్రజ్యాలన చేసి ప్రారంభించిన
మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ
సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7
సీఎం కప్ క్రిడా పోటీలు క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో బెజ్జంకి మండల స్థాయిలో జరిగే సీఎం క్రీడా పోటీలను మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి కృష్ణ,మండల స్థాయి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, ప్రతిభను చాటెందుకు సీఎం క్రీడ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.బెజ్జంకి మండలం లోని ఆయా గ్రామాల క్రీడాకారులు మండల,జిల్లా,రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి విద్యార్థులు మన బెజ్జంకి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్, బెజ్జంకి ఎస్సై సౌజన్య, ఎంఈఓ మహతి లక్ష్మి,ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.





