ప్రాంతీయం

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

15 Views

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,జనవరి 27, 2026 :
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల లోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను ఎన్నికల నిబంధనలకు లోబడి పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *