ప్రాంతీయం

కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కి భారీ చేరికలు మేయర్ పీఠం కైవసంకై అడుగులు

127 Views

*కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కి భారీ చేరికలు మేయర్ పీఠం కైవసంకై అడుగులు*

*కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మోసాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడుతున్న నాయకులు.*

మంచిర్యాల జిల్లా.

కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విసుకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మరిచి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంత పాలన చేస్తుందని దానికి వ్యతిరేకంగా పోరాడాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు  నాయకత్వాన్ని మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని *55 వ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రాజు* మరియు *49 డివిజన్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సత్తార్ * మరియు *13 డివిజన్ కాంగ్రెస్ నాయకులు లింగమూర్తి * వారి అనుచరులతో భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు* మరియు *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ *

బిఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం వారు మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వచ్చిన 6 గ్యారంటీలకు,420 హామీలకు ప్రజలు ఆకర్షితులై అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మరియు మంచిర్యాల ఎమ్మెల్యే  గెలుపుకు కారణమయ్యాయి అని అన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అలాగే మంచిర్యాలలో కాంగ్రెస్ అగ్ర నాయకుల అనుచరులు జరుగుతున్న దాడులు,బెదిరింపులు,సెటిల్మెంట్ ల వలన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని మరియు స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అని అన్నారు.కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉండదు అని వారు తెలిపారు.మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు  ఒంటెద్దు పోకట,ఏకపక్ష నిర్ణయాలు,నియంత పాలన జరుగుతుందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం పై ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత మరియు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పై ప్రజల్లో విశ్వాసం కోల్పోయామని అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలపడం జరిగింది. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు,మంచికి మారుపేరు,సామ్యూలు మన ప్రియతమ నాయకులు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు,TBGKS నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *