ప్రాంతీయం

బీజేపీ తోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

19 Views

*బీజేపీ తోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు*

మంచిర్యాల జిల్లా.

*మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం 59 మరియు 47 డివిజన్ లలో ఇంటి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.*

ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థి మేయర్ గా గెలిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, రెడ్డిమల్ల అశోక్, మందల స్వాతి, పవన్, కార్తీక్ మరియు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *